Apple firm: హైదరాబాద్ లో ఆపిల్ సంస్థ ఉద్యోగిని అదృశ్యం

  • రోహిత మిస్సయి నేటికీ.. తొమ్మిది రోజులు
  • డిసెంబర్ 26న ఆటో ఎక్కుతున్నట్లుగా సీసీటీవీలో రికార్డింగ్
  • ఆచూకీ తెలుసుకోవడంలో రెండు పోలీసుల బృందాలు

ఆపిల్ కంపెనీ ఉద్యోగిని కనిపించడం లేదంటూ.. పోలీసుల వద్ద ఫిర్యాదు నమోదైంది. హైదరాబాద్ లోని ఆపిల్ సంస్థలో ఉద్యోగం చేస్తున్న రోహిత కుత్తూరు అనే యువతి డిసెంబర్ 26వ తేదీ నుంచి  కనిపించకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆమె ఆచూకీని కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు.  

రోహిత డిసెంబర్ 26న మధ్యాహ్నం 3.15 గంటలకు గచ్చిబౌలిలోని విప్రో సర్కిల్ వద్ద ఆటో ఎక్కుతున్నట్లుగా సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. తన ఫోన్ ను ఆమె ఇంట్లోనే మరిచిపోవడంతో ఆచూకీ తెలుసుకోవడం సమస్యగా మారిందని తెలుస్తోంది. మూడు రోజుల పాటు రోహిత కోసం కుటుంబ సభ్యులు వెతికారు. ఫలితం లేకపోవడంతో చివరికి పోలీసులను ఆశ్రయించారు. ఈ కేసుపై సైబరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో రెండు బృందాలు పనిచేస్తున్నాయి.

Apple firm
Employee
Rohita Kutturu
Missing
Telangana
Hyderabad
  • Loading...

More Telugu News