Byreddy Rajasekar Reddy: ప్రతి గ్రామంలోనూ 40 దున్నపోతులను వదిలారు: జగన్ పై బైరెడ్డి ఫైర్

  • 11 వేల మీసేవ సెంటర్లు మూతపడ్డాయి
  • జగన్ మూడు ముక్కలాట ఆడుతున్నారు
  • పాలన అవకతవకలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం

గ్రామ సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లపై బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సచివాలయాలు, వార్డులు అంటూ ప్రతి గ్రామంలో 40 మంది తన దున్నపోతులను ప్రజలపై ముఖ్యమంత్రి జగన్ వదిలారని మండిపడ్డారు. కర్నూలులో మీసేవ నిర్వాహకులు ఈరోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.

ఈ కార్యక్రమానికి హాజరైన బైరెడ్డి ప్రసంగిస్తూ... జగన్ పై విమర్శలు గుప్పించారు. జగన్ నిర్ణయాలతో 11 వేల మీసేవ సెంటర్లు మూతపడ్డాయని మండిపడ్డారు. మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాటను ఆడుతున్నారని దుయ్యబట్టారు. జగన పాలన అవకతవకలతో కొనసాగుతోందని... వీటిని కేంద్రం, నీతి ఆయోగ్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.

Byreddy Rajasekar Reddy
Jagan
BJP
YSRCP
  • Loading...

More Telugu News