Yadadri Bhuvanagiri District: సీరియల్ కిల్లర్ శ్రీనివాసరెడ్డి వాదనను నేడు విననున్న కోర్టు

  • హాజీపూర్ హత్యల్లో నిందితుడు 
  • భారీ బందోబస్తు మధ్య తరలింపు 
  • గతనెల 26న ఓ బాలిక కేసులో వాంగ్మూలం నమోదు

హాజీపూర్ సీరియల్ కిల్లర్ శ్రీనివాసరెడ్డి వాదనలను ఈ రోజు కోర్టు నమోదు చేయనుంది. గత నెల 26న ఓ బాలిక హత్యాచారం విషయంలో కోర్టు ఇతని వాంగ్మూలం నమోదు చేసింది. ఆ సందర్భంలో ఆ బాలిక ఎవరో కూడా తనకు తెలియదని శ్రీనివాసరెడ్డి తెలిపాడు. ఈ రోజు మరికొన్ని కేసులకు సంబంధించి శ్రీనివాసరెడ్డి వాదనను కోర్టు విననుంది. దీంతో భారీ పోలీస్ బందోబస్తు మధ్య శ్రీనివాసరెడ్డిని నల్గొండ జిల్లా జైలు నుంచి పోలీసులు కోర్టుకు తరలించారు. యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్‌లో ముగ్గురు బాలికలపై నిందితుడు శ్రీనివాసరెడ్డి అత్యాచారం జరిపి ఆపై హత్య చేశాడన్నది ప్రధాన ఆరోపణ. 

Yadadri Bhuvanagiri District
hajeepoor
srinivasreddy
serial killer
  • Loading...

More Telugu News