Pakistan: పాకిస్థాన్ గగనతలాన్ని వాడద్దు.. తమ విమానయాన సంస్థలకు అమెరికా నోటీసులు!

  • పాక్ మీదుగా వెళ్లవద్దు
  • 'నోటామ్'ను జారీ చేసిన ఎఫ్ఏఏ
  • అన్ని సంస్థలకూ వర్తిస్తుందని వెల్లడి

పాకిస్థాన్ గగనతలాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వాడరాదని అమెరికా నిషేధాజ్ఞలు జారీ చేసింది. యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఈమేరకు అమెరికా ఎయిర్ లైన్స్ సంస్థలకు, వాటిల్లో పనిచేసే పైలెట్లకు ఆదేశాలు జారీ చేసింది. పాకిస్థాన్ ఎయిర్ స్పేస్ ను వాడటం రిస్క్ తో కూడుకున్నదని, తీవ్రవాదులు, మిలిటెంట్ కార్యకలాపాలు అధికంగా జరుగుతున్నాయని, విమానాలకు ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని యూఎస్ అభిప్రాయపడింది.

యూఎస్ పౌర విమానయాన కార్యకలాపాలకు పాకిస్థాన్ గగనతలంపై అవాంతరాలు ఏర్పడవచ్చని భావించిన మీదటే ఎఫ్ఏఏ, 'నోటామ్' (నోటీస్ టూ ఎయిర్ మ్యాన్) జారీ చేసిందని అమెరికా అధికారులు వెల్లడించారు. డిసెంబర్ 30వ తేదీతో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. ఇది అన్ని యూఎస్ కేంద్రంగా నడిచే విమానయాన సంస్థలకు, పైలెట్లకూ వర్తిస్తుందని పేర్కొంది.

Pakistan
Air Space
USA
Flights
Civil Aviation
  • Loading...

More Telugu News