IYR: దొంగలు, దొంగలు పంచుకున్నారు... ఇప్పుడు నిజం బయటకు: ఐవైఆర్ కీలక వ్యాఖ్యలు!

  • ఇన్ సైడర్ ట్రేడింగ్ పై వైసీపీ వీడియో ప్రజెంటేషన్
  • దొంగల పంపకాల్లో తేడాలు వచ్చాయి
  • ట్విట్టర్ లో ఐవైఆర్ సెటైర్లు

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని, వేలాది ఎకరాలను తెలుగుదేశం పార్టీ నేతలు, తమ బినామీలతో కొనిపించారని నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వీడియో ప్రజెంటేషన్ రూపంలో ఆరోపించిన నేపథ్యంలో, మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, దొంగలు, దొంగలు పంచుకున్నారని, ఇప్పుడు నిజం బయటకు వస్తోందని సెటైర్లు వేశారు.

"దొంగల పంపకాల్లో తేడాలవల్ల నిజాలు బయటకు వచ్చినట్లు రాజకీయ తేడాలతో ఇన్సైడర్ ట్రేడింగ్ నిజాలు బయటకు వస్తున్నాయి. ప్రభుత్వంలో ఉన్న వారి బాధ్యత రెండిటినీ విచారించి చర్య తీసుకోవడం" అని ఆయన అన్నారు. మొత్తం వ్యవహారంలో సమగ్ర విచారణ జరిపించాలని ఐవైఆర్ కృష్ణారావు డిమాండ్ చేశారు.

IYR
Insider Trading
YSRCP
Amaravati
Twitter
  • Error fetching data: Network response was not ok

More Telugu News