Andhra Pradesh: గవర్నర్ బిశ్వభూషణ్ ను కలిసిన సీఎం జగన్

  • విజయవాడలోని రాజ్ భవన్ కు వెళ్లిన జగన్  
  • రాష్ట్రంలోని తాజా రాజకీయాలు, మూడు రాజధానుల అంశంపై చర్చ
  • జగన్ వెంట ఉన్న ఆయన భార్య భారతి

ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను సీఎం జగన్ ఈ రోజు కలిశారు. విజయవాడలోని రాజ్ భవన్ లో బిశ్వభూషణ్ ను మర్యాదపూర్వకంగా ఆయన కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా రాజకీయాలు, మూడు రాజధానుల అంశంతో పాటు పలు ముఖ్యమైన అంశాలను వివరించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. జగన్ తో పాటు ఆయన భార్య భారతి కూడా ఉన్నారు. గవర్నర్ దంపతులను జగన్ దంపతులు శాలువాలతో సత్కరించారు. పుష్పగుచ్చాలు అందజేశారు.

Andhra Pradesh
Governer
Harichandan
jagan
  • Loading...

More Telugu News