Babita Rayudu: సెబీ కొత్త ఈడీగా బబితా రాయుడు!

  • ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా బబితా రాయుడు
  • గతంలో న్యాయ వ్యవహారాల విభాగంలో సేవలు
  • పదోన్నతిపై ఈడీగా నియామకం

సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా బబితారాయుడు నియమితులయ్యారు. న్యాయపరమైన వ్యవహారాలు, ప్రత్యేక ఎన్ ఫోర్స్ మెంట్, వ్యవహారాలు ఆయన పర్యవేక్షణలో జరుగనున్నాయని సెబీ వెల్లడించింది.

ఇప్పటివరకూ న్యాయ వ్యవహారాల విభాగంలో పని చేసిన ఆయన్ను పదోన్నతిపై ఈడీగా నియమించినట్టు సెబీ పేర్కొంది. కాగా, డిసెంబర్ లోనే జనరల్, లీగల్ విభాగాలకు కొత్త ఈడీలను నియమించాలని భావించిన సెబీ, దరఖాస్తులను ఆహ్వానించింది. మొత్తం 15 దరఖాస్తులు అందగా, వారి నుంచి ఎవరినీ ఎంపిక చేయకుండా, అంతర్గతంగా జనరల్ విభాగానికి వీఎస్ సుందరేశన్, లీగల్ విభాగానికి బబితా రాయుడులను ఎంపిక చేసింది. కొత్త నియామకాలపై సెబీ తాజాగా ప్రకటన వెలువరించింది.

Babita Rayudu
SEBI
ED
Executive Director
  • Loading...

More Telugu News