Hyderabad: పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ముందు నిప్పంటించుకున్న మహిళ

  • ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు
  • డెబ్బై శాతం మేరకు కాలిపోయిన శరీరం 
  • బాధితురాలు చెన్నైకు చెందిన లోకేశ్వరిగా గుర్తింపు

హైదరాబాద్ లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ముందు ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. వివాహాలు కుదిర్చే వెబ్ సైట్ కు చెందిన ఓ వ్యక్తి తనను మోసం చేశాడన్న మనస్తాపంతో ఆమె ఆత్మహత్యకు యత్నించినట్టు సమాచారం. వెంటనే, ఆమెను ఉస్మానియా ఆసుపత్రికి పోలీసులు తరలించారు. డెబ్బై శాతం మేరకు ఆమె శరీరం కాలిపోయిందని, ఆరోగ్యపరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. కాగా, ఆత్మహత్యకు యత్నించిన మహిళ పేరు లోకేశ్వరి అని, చెన్నైకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించినట్టు సమాచారం.

Hyderabad
punjagutta
police station
woman
sucide
Osmania hospital
chennai
  • Loading...

More Telugu News