Chandhrababu Naidu: పవన్ ను అడ్డుకోవడం అప్రజాస్వామికం: చంద్రబాబు

  • రైతులకు మద్దతు తెలిపేందుకు వెళితే తప్పా?
  • వైసీపీ ప్రభుత్వం నిరంకుశ పోకడలకు పరాకాష్ఠ  
  • వేల ఎకరాల భూములను రైతులు త్యాగం చేశారు

అమరావతిలో పవన్ పర్యటనను పోలీసులు అడ్డుకోవడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ..  అక్కడి రైతులకు మద్దతు తెలిపేందుకు వెళుతున్న పవన్ కల్యాణ్ ను అడ్డుకోవడం అనైతికం, అప్రజాస్వామికమని ధ్వజమెత్తారు. ఇది వైసీపీ ప్రభుత్వం నిరంకుశ పోకడలకు పరాకాష్ఠ అని విమర్శించారు. రాజధానికోసం వేలాది ఎకరాల భూములను రైతులు త్యాగం చేశారన్నారు. రైతులకు, మహిళలకు అండగా ఉండేందుకు వెళ్లడం నేరమా ? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

రేపు రాజధాని గ్రామాల్లో చంద్రబాబు పర్యటన

రాజధాని ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు రేపు పర్యటన చేయనున్నారు. అక్కడి రైతులకు సంఘీభావం తెలుపుతారు. ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, మందడంలో పర్యటించనున్నారు. రైతుల ఆందోళన నేపథ్యంలో కొత్త సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.

Chandhrababu Naidu
condemn
police action
Pawan Kalyan
Andhra Pradesh
Amaravati
  • Loading...

More Telugu News