Lavanya Tripathi: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

  • కార్తికేయకు నాయికగా లావణ్య 
  • తొలి షెడ్యూలు పూర్తి చేసిన గోపీచంద్ 
  • 'సరిలేరు నీకెవ్వరు'కి రీరికార్డింగ్  

*  ఇటీవల 'అర్జున్ సురవరం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అందాలతార లావణ్య త్రిపాఠి తాజాగా కార్తికేయ సరసన హీరోగా నటించడానికి ఓకే చెప్పింది. దీనికి నూతన దర్శకుడు కౌశిక్ దర్శకత్వం వహిస్తాడు.
*  యాక్షన్ హీరో గోపీచంద్ కథానాయకుడుగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం తొలి షెడ్యూలు షూటింగ్ పూర్తయింది. పదిహేను రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూలులో ముఖ్య సన్నివేశాలను చిత్రీకరించామని దర్శకుడు తెలిపారు. ఇందులో తమన్నా కథానాయికగా నటిస్తోంది.
*  మహేశ్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'సరిలేరు నీకెవ్వరు' చిత్రానికి సంబంధించిన రీరికార్డింగ్ కార్యక్రమాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ దీనికి అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇస్తున్నట్టు చెబుతున్నారు.  

Lavanya Tripathi
Karthikeya
Gopichand
Thamanna
  • Loading...

More Telugu News