Actor Ali mother demise: అలీని పరామర్శించిన మంత్రి తలసాని

  • అలీ తల్లి మరణించిన నేపథ్యంలో మంత్రి పరామర్శ
  • మణికొండలోని అలీ నివాసానికి వెళ్లిన మంత్రి
  • సంతాపాన్ని వ్యక్తం చేసిన పలువురు సినీ ప్రముఖులు

ప్రముఖ సినీ నటుడు అలీని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. ఇటీవల అలీ తల్లి జైతున్ బీబీ మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి తలసాని ఈ రోజు సాయంత్రం హైదరాబాదు, మణికొండలోని అలీ నివాసానికి వెళ్లి పరామర్శించారు.

ఈ సందర్భంగా అలీ కుటుంబ సభ్యులతో మంత్రి తలసాని మాట్లాడుతూ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అలీ తల్లి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలిపారు. చిరంజీవి, పవన్ కల్యాణ్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సభ్యులు, తదితరులు అలీని పరామర్శించిన వారిలో ఉన్నారు.

Actor Ali mother demise
minister Talasani srinivas yadav condelence
Talasani met Ali
  • Loading...

More Telugu News