Renu Desai: పవన్ కల్యాణ్ అభిమానికి ఘాటుగా బదులిచ్చిన రేణూ దేశాయ్!

  • అకీరా, ఆద్యల ఫొటో పోస్టు చేసిన రేణూ
  • ఎంతైనా పవన్ రక్తం కదా అన్న అభిమాని
  • పవన్ రక్తం కాదు తన రక్తమేనన్న రేణూ!

జనసేనాని పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ ప్రస్తుతం పూణేలో ఉంటోన్న సంగతి తెలిసిందే. తన పిల్లలు అకీరా, ఆద్యలను అక్కడే చదివిస్తోంది. అప్పుడప్పుడు వారి ముచ్చట్లను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఓ తల్లిగా మురిసిపోతూ ఉంటుంది. తాజాగా ఆమె అకీరా, ఆద్యలకు సంబంధించిన ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది.

"వన్, టూ, త్రీ అని లెక్కపెట్టేలోగా మీ ముందు ఉంటా... మీరు నా వాళ్లు!" అంటూ పేర్కొంది. దీనికి పవర్ స్టార్ అభిమాని ఒకరు స్పందిస్తూ, ఎంతైనా పవన్ రక్తం కదా అని సెంటిమెంట్ డైలాగ్ కొట్టాడు. దాంతో, రేణూ దేశాయ్ కి చిర్రెత్తుకొచ్చింది. వారిద్దరిలో ప్రవహిస్తోంది నా రక్తమే అంటూ గట్టిగా జవాబిచ్చింది. అది టెక్నికల్ గా అయినా, సైన్స్ పరంగా అయినా వారిద్దరిలో ప్రవహించేది తల్లి రక్తమే. బిడ్డలకు తల్లి నుంచే రక్తం అందుతుందని సైన్స్ గురించి తెలిసిన వాళ్లకు ఈ విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అంటూ తనదైనశైలిలో స్పందించింది.

Renu Desai
Pawan Kalyan
Akira
Adya
Tollywood
  • Loading...

More Telugu News