Director: రూ. 30 లక్షల మోసం కేసు... కోలీవుడ్ దర్శకురాలు విజయపద్మపై పోలీసు కేసు!

  • తమిళంలో 'నర్తకి' చిత్రాన్ని తీసిన విజయ పద్మ
  • నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి ఫ్లాట్ ను లీజుకిచ్చిన దర్శకురాలు
  • కేసును విచారిస్తున్న పోలీసులు

కోలీవుడ్ దర్శకురాలు విజయ పద్మపై రూ. 30 లక్షల మోసం కేసును తిరువాన్మయూర్ పోలీసులు నమోదు చేశారు. ఈ ప్రాంతానికి చెందిన సుమతి అనే మహిళ ఫిర్యాదుపై ఈ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే, రాయల్‌ కేన్‌ పేరిట సుమతి, ఓ పర్నీచర్‌ దుకాణాన్ని నడుపుతోంది. తన షాపునకు వచ్చే విజయ పద్మ, ఆమె భర్త ముత్తు కృష్ణన్ లు తాము ధనవంతులమన్న కలర్ ఇవ్వడంతో నమ్మేసింది. ఆ సమయంలో సుమతి ఒక ఇల్లు లీజ్ కోసం వెతుకుతున్న విషయాన్ని తెలుసుకున్న విజయ పద్మ, తమ ప్లాట్‌ ను లీజుకు ఇస్తామని చెప్పింది.

కొట్టివాక్కంలోని ఒక అపార్ట్‌ మెంట్‌ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న ఫ్లాట్ కు నకిలీ డాక్యుమెంట్స్ చూపించి, అది తమదేనని, రూ. 30 లక్షలు ఇస్తే, లీజ్ కు ఇస్తామని నమ్మబలికింది. దీంతో సుమతి తన వద్ద ఉన్న బంగారు నగలను తాకట్టు పెట్టి, రూ. 30 లక్షలు చెల్లించి, అగ్రిమెంట్ రాయించుకుంది. తీరా అక్కడ నివాసం ఉండేందుకు వెళ్లగా, అది విజయ పద్మది కాదని తెలియడంతో అవాక్కైంది.

గట్టిగా నిలదీస్తే, తాను తీసుకున్న డబ్బుకు రెండు చెక్కులను ఇచ్చింది. అవి బ్యాంకులో బౌన్స్ అయ్యాయి. దీంతో సుమతి పోలీసులను ఆశ్రయించగా, పోలీసులు కేసును విచారిస్తున్నారు. కాగా, విజయ పద్మ 'నర్తకి' అనే సినిమాకు దర్శకత్వం వహించి, ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకుంది.

  • Loading...

More Telugu News