North India: గడ్డకట్టిన దాల్ సరస్సు.. ద్రాస్‌లో మైనస్ 28.7 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రత

  • గడ్డకట్టుకుపోతున్న ఉత్తర భారతం
  • పాఠశాలలకు సెలవులు ప్రకటించిన హరియాణా ప్రభుత్వం
  • చలిమంటలను ఆశ్రయిస్తున్న ప్రజలు

చలితో ఉత్తర భారతదేశం గడ్డకట్టుకుపోతోంది. ఉష్ణోగ్రతలు రోజురోజుకు మైనస్‌లలోకి పడిపోతున్నాయి. శీతల గాలులు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. చలిగాలుల తీవ్రత పెరగడంతో హరియాణా ప్రభుత్వం పాఠశాలలకు రెండు రోజులపాటు సెలవులు ప్రకటించింది.

వెలుతురు మందగించడంతో ఢిల్లీలోని పలు విమాన, రైలు సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక, జమ్మూ, కశ్మీర్‌లో ఉష్ణోగ్రత మైనస్ 6.2 డిగ్రీలకు పడిపోగా, ద్రాస్‌లో ఏకంగా మైనస్ 28.7 డిగ్రీలకు పడిపోయింది. దాల్ సరస్సు అయితే ఏకంగా గడ్డకట్టుకుపోయింది. దీంతో పర్యాటక బోట్లు తీరానికే పరిమితమయ్యాయి. చలి నుంచి రక్షణ కోసం ప్రజలు చలి మంటలను ఆశ్రయిస్తున్నారు.

North India
Dal lake
frozen winter
  • Loading...

More Telugu News