New Delhi: ప్రాణాలు తీసిన పొగమంచు.. అదుపుతప్పి కాల్వలోకి కారు.. ఆరుగురి మృతి

  • గ్రేటర్ నోయిడాలో ఘటన
  • పొగమంచు కారణంగా కనిపించని దారి
  • మృతుల్లో ఇద్దరు మైనర్లు

పొగమంచు ఆరుగురి ప్రాణాలను బలితీసుకుంది. దట్టంగా కమ్ముకున్న మంచు కారణంగా దారి కనిపించకపోవడంతో అదుపు తప్పిన ఓ కారు కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. గ్రేటర్ నోయిడాలో జరిగిందీ ఘటన.

సంబల్ జిల్లా నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఓ కారు గ్రేటర్ నోయిడా వద్ద అదుపు తప్పి ఓ కాల్వలోకి దూసుకెళ్లింది. మంచు కారణంగా ముందున్న దారి కనిపించకపోవడమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనలో ఇద్దరు మైనర్లు సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు, ఢిల్లీలో పొగమంచు కారణంగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు విమానాలను దారి మళ్లించారు. ఉత్తర రైల్వే పరిధిలో 30 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.

New Delhi
Greater Noida
Road Accident
  • Loading...

More Telugu News