winter: చలికి వణుకుతున్న ఏపీ.. భయపెడుతున్న శీతల గాలులు

  • ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న శీతల గాలులు
  • కళింగపట్నంలో తొలిసారి 14.2 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు
  • గడ్డకడుతున్న ఏజెన్సీ ప్రాంతాలు

ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో ప్రజలు చలికి వణుకుతున్నారు. బంగాళాఖాతంలో కొనసాగిన ద్రోణి ప్రభావంతోపాటు ఉత్తర, మధ్య తూర్పు భారతదేశం నుంచి శీతల గాలులు వీస్తున్నాయి. దీనికి తోడు సముద్రం నుంచి వీస్తున్న తేమ గాలుల ప్రభావంతో కోస్తాలో చలి ఒక్కసారిగా పెరిగింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే దిగువకు పడిపోయాయి. ముఖ్యంగా ఒడిశాకు ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు చలికి గడ్డకట్టుకుపోతున్నారు. కోస్తా తీర ప్రాంతమైన కళింగపట్నంలో ఈ సీజన్‌లోనే తొలిసారి అత్యంత తక్కువగా 14.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆరోగ్యవరంలో 16.5, నందిగామలో 17.6, తునిలో 18.7 డిగ్రీలు నమోదయ్యాయి.

winter
Coastal AP
Breze winds
  • Loading...

More Telugu News