Rapid Chess: ర్యాపిడ్ చెస్ విజేత కోనేరు హంపిని అభినందించిన సీఎం జగన్

  • మాస్కోల్లో వరల్డ్ ర్యాపిడ్ చెస్ టోర్నీ
  • మహిళల విభాగంలో టైటిల్ గెల్చుకున్న హంపి
  • తొలి భారత మహిళగా ఘనత

వరల్డ్ ర్యాపిడ్ చెస్ టైటిల్ కైవసం చేసుకున్న తెలుగమ్మాయి కోనేరు హంపిని ఏపీ సీఎం జగన్ అభినందించారు. మాస్కోలో జరిగిన ప్రతిష్ఠాత్మక ప్రపంచ ర్యాపిడ్ చెస్ టోర్నీలో గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి మహిళల విభాగంలో వరల్డ్ చాంపియన్ గా నిలిచింది. ఈ ఘనత సాధించిన తొలి మహిళా భారత గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపినే కావడం విశేషం. దీనిపై సీఎం జగన్ స్పందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని, హంపి సాధించిన విజయం రాష్ట్ర ప్రజలకే కాకుండా యావత్ దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు.

Rapid Chess
Moscow
Russia
Koneru Hampi
YSRCP
Jagan
Andhra Pradesh
  • Loading...

More Telugu News