chennai: చెన్నైలో పౌరసత్వ చట్టంపై వినూత్న రీతిలో నిరసన!

  • రోడ్లపైనా, కొందరి నివాసాల ముందు ముగ్గులు వేసి నిరసన
  • ‘NO TO CAA’, ‘NO TO NRC’, ‘NO TO NPR’ అంటూ ముగ్గులు
  • ఏడుగురి అరెస్టు, ఆపై విడుదల

జాతీయ పౌరసత్వ సవరణ చట్టంపై చెన్నైలో వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేసిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రోడ్లపైనా, కొందరి నివాసాల ముందు ‘NO TO CAA’, ‘NO TO NRC’, ‘NO TO NPR’ అని ముగ్గులు వేసి నిరసనలు తెలిపారు. ఈ నేపథ్యంలో నలుగురు మహిళలను, ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని విడిపించేందుకు వచ్చిన మరో ఇద్దరు లాయర్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, వీరిని విడిచిపెట్టారు.

నిరసన తెలిపేందుకు ఎటువంటి అనుమతి తీసుకోకపోవడంతో అరెస్టు చేశామని పోలీసులు చెబుతుండగా, వారి వ్యాఖ్యలను నిరసనకారులు తప్పుబడుతున్నారు. నిరసన తెలిపేందుకు తమకు అనుమతి ఇవ్వమని కోరినా ఇవ్వలేదని చెప్పారు. అందుకే, వినూత్నరీతిలో నిరసన తెలపాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు నిరసనకారులు చెప్పారు.

chennai
CAA
Protest
Arrest
police
  • Loading...

More Telugu News