Kiran Bedi: కాస్త హుందాగా వ్యవహరించండి: పుదుచ్చేరి సీఎంకు హితవు పలికిన కిరణ్ బేడీ

  • పుదుచ్చేరిలో గవర్నర్, సీఎం మధ్య మాటల యుద్ధం
  • కిరణ్ బేడీని దెయ్యం అంటూ అభివర్ణించిన సీఎం నారాయణస్వామి
  • ఆ తిట్లు తిట్టినవాళ్ల వద్దే ఉంటాయన్న కిరణ్ బేడీ

గత కొన్నిరోజులుగా పుదుచ్చేరిలో గవర్నర్ కిరణ్ బేడీ, సీఎం నారాయణస్వామిల మధ్య తీవ్రస్థాయిలో మాటలయుద్ధం జరుగుతోంది. పుదుచ్చేరి ఆదాయం పెంచుకునేందుకు కాసినోలు, మద్యం తయారీ సంస్థలు, లాటరీ కంపెనీలు స్థాపించాలని సీఎం నారాయణస్వామి భావిస్తుండగా, కిరణ్ బేడీ అందుకు అభ్యంతరం చెబుతుండడంతో ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం నెలకొంది. ఈ క్రమంలో కిరణ్ బేడీని నారాయణస్వామి దెయ్యం అని, మనస్సాక్షి లేని వ్యక్తి అని, జర్మనీ నియంత హిట్లర్ కు చెల్లెలు అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై కిరణ్ బేడీ ఘాటుగా స్పందించారు. సీఎం నారాయణస్వామి కాస్త హుందాగా, సభ్యతతో నడుచుకుంటే మంచిదని హితవు పలికారు.

"కొన్నిరోజులుగా మీరు నన్ను అనేక పేర్లతో దూషిస్తున్న విధానం గమనిస్తున్నాను. ఇటీవలే మీ ప్రవర్తన హద్దుమీరింది. లెఫ్టినెంట్ గవర్నర్ గా నేనెప్పుడూ ప్రజల క్షేమం గురించే ఆలోచిస్తాను" అంటూ స్పందించారు. అంతేకాదు, ఈ సందర్భంగా బుద్ధుడు పేర్కొన్న హితోక్తిని కూడా కిరణ్ బేడీ ప్రస్తావించారు. "ఎవరైనా ఒకర్ని దూషించినప్పుడు ఆ రెండో వ్యక్తి ఆ తిట్లను స్వీకరించకపోతే, ఆ తిట్లు మొదటి వ్యక్తి వద్దే ఉంటాయి" అంటూ వ్యాఖ్యానించారు.

Kiran Bedi
Narayanaswamy
Puducheri
  • Loading...

More Telugu News