BCG: బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ పై అనేక కేసులు ఉన్నాయి: దేవినేని ఉమ
- రాజధానిని మార్చడం అవివేకం అంటూ వ్యాఖ్యలు
- ఇందులో కుట్ర ఉందని ఆరోపణ
- రైతులకు టీడీపీ మద్దతిస్తుందని వెల్లడి
రాజధానిని మార్చాలని చూడడం సీఎం అవివేకం అంటూ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ ధ్వజమెత్తారు. అధ్యయనం బాధ్యతలు అప్పగించిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) సంస్థపై అనేక కేసులు ఉన్నాయని వివరించారు. విశాఖను రాజధానిగా చేయాలనుకోవడం వెనుక కుట్ర దాగివుందని ఉమ ఆరోపించారు. జనవరి 3న బోస్టన్ నివేదిక వస్తుందని, ఆ తర్వాత హైపవర్ కమిటీకి రెండు వారాల సమయం ఉంటుందని వెల్లడించారు. అనంతరం, జనవరి 18న అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి రాజధాని మార్చాలనేది జగన్ ప్రణాళిక అని ఉమ ఆరోపించారు. రాజధాని రైతుల ఆందోళనకు టీడీపీ పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు.