Mary Kom: మేరీకోమ్ చేతిలో చిత్తుగా ఓడిపోయిన తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్

  • ట్రయల్స్ మ్యాచ్ లో జరీన్ కు నిరాశ
  • మేరీకోమ్ పిడిగుద్దులకు తట్టుకోలేకపోయిన జరీన్
  • జరీన్ ను 9-1 తేడాతో చిత్తు చేసిన మేరీకోమ్

ఆరు సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన మేరీకోమ్ తో తలపడే అవకాశాన్ని ఎట్టకేలకు తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ కు దక్కింది. అయితే, మేరీకోమ్ ను ఓడించాలనుకున్న జరీన్ ఆశలు అడియాశలయ్యాయి. మేరీకోమ్ ధాటికి ఆమె చేతులెత్తేసింది. 51 కిలోల కేటగిరిలో జరిగిన మ్యాచ్ లో మేరీకోమ్ 9-1 తేడాతో జరీన్ ను చిత్తు చేసింది. ఎంతో అనుభవశాలి అయిన మేరీకోమ్ పిడిగుద్దులకు జరీన్ తట్టుకోలేకపోయింది. వచ్చే ఏడాది చైనాలో జరిగే ఒలింపిక్స్ అర్హత పోటీలకు నిర్వహించిన ట్రయల్స్ లో ఓటమిపాలైంది.

గతంలో వేరే విభాగంలో మేరీకోమ్ తలపడేది. అయితే తాజాగా ఆమె 51 కిలోల కేటగిరీకి మారింది. దీంతో, ఇదే విభాగంలో జరీన్ పోటీ పడుతోంది. ఈ కేటగిరీకి మేరీకోమ్ మారడంతో... జరీన్ కు ఒలింపిక్స్ లో పాల్గొనే అవకాశం లేకుండా పోతుంది. ఎంతో అనుభవం ఉన్న మేరీకోమ్ ను ట్రయల్స్ తో సంబంధం లేకుండా నేరుగా ఒలింపిక్స్ కు ఎంపిక చేయాలనుకున్నట్టు భారత బాక్సింగ్ సమాఖ్య అధ్యక్షుడు అజయ్ సింగ్ ప్రకటించారు. ఈ ప్రకటనతో వివాదం మొదలైంది. ట్రయల్స్ నిర్వహించాల్సిందేనని కేంద్ర క్రీడా మంత్రికి జరీన్ లేఖ రాసింది. దీంతో, ట్రయల్స్ నిర్వహించగా... చివరకు జరీన్ చిత్తుగా ఓడిపోయింది.

  • Loading...

More Telugu News