Pakistan: భారత్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన పాక్ క్రికెటర్ మియాందాద్.. ఐసీసీకి మతిలేని సూచన!
- విదేశీ జట్ల పర్యటనకు భారత్ అంత సురక్షితం కాదు
- భారత ప్రజలు వారిలో వారే పోట్లాడుకుంటారు
- ఐసీసీ ఈ విషయాన్ని ప్రకటించాలి
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మియాందాద్ భారత్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. విదేశీ క్రికెటర్ల పర్యటనకు భారత్ అంత సురక్షితమైన ప్రదేశం కాదని, కాబ్టటి ఇకపై ఏ జట్టూ భారత్‌లో పర్యటించకుండా చూడాలని ఐసీసీని కోరాడు. ఇదే విషయాన్ని ఐసీసీ ప్రకటించాలని డిమాండ్ చేశాడు. భారతదేశం ఇక ఎప్పటికీ సురక్షితం కాబోదని, ఆ దేశం కంటే ఇతర దేశాలు చాలా బెటరని పేర్కొన్నాడు. ఆ దేశ ప్రజలు వారిలో వారే పోట్లాడుకుంటారని, కావాలంటే ఒకసారి అటువైపు చూడాలంటూ పరోక్షంగా పౌరసత్వ బిల్లుపై జరుగుతున్న ఆందోళనలను ప్రస్తావించాడు. ఈ విషయంలో ఐసీసీ తప్పకుండా చర్యలు తీసుకోవాలని మియాందాద్ కోరాడు.
విదేశీ జట్లు భారత్‌లో పర్యటించకుండా అడ్డుకోవాలన్నదే తన డిమాండ్ అని, ఇదే విషయాన్ని ఐసీసీకి విజ్ఞప్తి చేస్తున్నట్టు మియాందాద్ తెలిపాడు. తన సూచనపై ఐసీసీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉందన్నాడు. ఇప్పుడు ఐసీసీ ఏం చేస్తుందో, ప్రపంచానికి ఏమని చెబుతుందో చూడాలని ఉందంటూ మియాందాద్ చేసిన వ్యాఖ్యలపై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. కాగా, పాక్ క్రికెటర్లు భారత్‌పై విద్వేష వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. సమయం, సందర్భం లేకుండా భారత్‌పై విషం కక్కుతుండడం పరిపాటిగా మారింది.