siricilla: సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ పై కిరోసిన్ పోసేందుకు ఓ వ్యక్తి విఫలయత్నం

  • సిరిసిల్లలో ఇంటి నిర్మాణం కోసం శంకర్ దరఖాస్తు
  • ఈ దరఖాస్తును తిరస్కరించిన కమిషనర్
  • కమిషనర్ ఫిర్యాదు మేరకు నిందితుడి అరెస్టు

తెలంగాణలోని సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ పై కిరోసిన్ పోసేందుకు ఓ వ్యక్తి యత్నించాడు. వెంటనే అప్రమత్తమైన మున్సిపల్ సిబ్బంది ఆ వ్యక్తిని అడ్డుకున్నారు. సిరిసిల్లలో ఇంటి నిర్మాణం కోసం సంకినేని శంకర్ దరఖాస్తు చేసుకున్నాడు. మున్సిపల్ స్థలంలో ఇంటి నిర్మాణానికి అనుమతినిచ్చేందుకు కమిషనర్ నిరాకరించారు.

దీంతో, ఆయనపై కిరోసిన్ పోసేందుకు శంకర్ యత్నించాడు. కమిషనర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. శంకర్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. కాగా, కమిషనర్ అనుమతి నిరాకరించారన్న కోపంతో ఈ నెల 24న మున్సిపల్ కార్యాలయం ముందు శంకర్ ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు. తన ఒంటిపై కిరోసిన్ పోసుకునే ప్రయత్నం చేశాడు.

siricilla
muncipal commissioner
Attack
Arrest
  • Loading...

More Telugu News