Parwez Musharraf: హడావుడిగా విచారణ ముగించారు: మరణశిక్షపై హైకోర్టులో అప్పీల్ చేసిన ముషారఫ్

  • ముషారఫ్ పై దేశద్రోహం అభియోగాలు
  • మరణశిక్ష విధించిన ప్రత్యేక న్యాయస్థానం
  • ప్రత్యేక న్యాయస్థానం తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసిన ముషారఫ్

రాజ్యాంగాన్ని రద్దు చేసి దేశద్రోహానికి పాల్పడ్డారంటూ మాజీ సైనిక పాలకుడు పర్వేజ్ ముషారఫ్ కు పాకిస్థాన్ ప్రత్యేక న్యాయస్థానం మరణశిక్ష విధించడం తెలిసిందే. దీనిపై ముషారఫ్ లాహోర్ హైకోర్టును ఆశ్రయించారు. తనకు విధించిన మరణశిక్షపై ఆయన లాహోర్ హైకోర్టులో అప్పీల్ చేశారు.

ప్రత్యేక న్యాయస్థానం వ్యవహరించిన తీరు అసంబద్ధంగా ఉందని, విచారణ సందర్భంగా పేర్కొన్న అంశాలు సహేతుకంగా లేవని తన పిటిషన్ ఆరోపించారు. అంతేకాకుండా, ఎంతో హడావుడిగా విచారణ ముగించినట్టు కనిపిస్తోందని, ఎన్నో వాదనలు వినాల్సి ఉన్న కేసును ఇంత త్వరితగతిన ముగించడంపై పలు సందేహాలు ఉన్నాయని పేర్కొన్నారు.

Parwez Musharraf
Pakistan
Treason
High Court
Lahore
  • Loading...

More Telugu News