Devisri prasad: దేవిశ్రీప్రసాద్ తో పోటీపై స్పందించిన తమన్

  • ఒకే సీజన్ లో విడుదలవుతున్న తమన్, దేవిశ్రీ చిత్రాలు
  • అల వైకుంఠపురములో చిత్రానికి తమన్ సంగీతం
  • సరిలేరు నీకెవ్వరు సినిమాకు దేవిశ్రీ బాణీలు

టాలీవుడ్ లో ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు దేవిశ్రీప్రసాద్, తమన్. అగ్రహీరోల సినిమా అంటే వీళ్లిద్దరిలో ఎవరో ఒకరు సంగీతం అందించాల్సిందే అన్నంతగా ట్రెండ్ ఫిక్సయింది. ప్రస్తుతం మహేశ్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రానికి దేవిశ్రీప్రసాద్ బాణీలు అందించగా, అల్లు అర్జున్ అల.. వైకుంఠపురములో చిత్రానికి తమన్ స్వరాలు కూర్చారు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో తమన్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

దేవిశ్రీ సంగీతంలో సరిలేరు నీకెవ్వరు, మీరు సంగీతం అందించిన అల వైకుంఠపురములో ఒకేసారి వస్తున్నాయి కదా, మీపై ఒత్తిడి ఉందా అని ప్రశ్నించగా, పోటీ ఉన్నప్పుడే మన స్టామినా ఏంటో తెలుస్తుందని తమన్ జవాబిచ్చారు. అయితే, దేవిశ్రీప్రసాద్ తో తనకు సత్సంబంధాలు ఉన్నాయని, ఇద్దరి మధ్య సోషల్ మీడియాలో సంభాషణలు కూడా జరుగుతుంటాయని తెలిపారు. అంతేకాదు, గతంలో తాను దేవిశ్రీప్రసాద్ వద్ద తొమ్మిది సినిమాలకు ప్రోగ్రామర్ గా వ్యవహరించానని వెల్లడించారు.

Devisri prasad
Thaman
Music
Tollywood
Sarileru Neekevvaru
Ala.. Vaikuntapuramulo
  • Loading...

More Telugu News