Thammineni Seetharam: తుగ్లక్ లకే జగన్ పాలన తుగ్లక్ లా అనిపిస్తుంది: తమ్మినేని సీతారాం

  • జగన్ పాలన అద్భుతంగా ఉంది
  • విశాఖలో రాజధానిని టీడీపీ ఎందుకు వ్యతిరేకిస్తోంది
  • అమరావతిలో టీడీపీ నేతలు భూములను కొల్లగొట్టారు

జగన్ పాలన అద్భుతంగా ఉందని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం కితాబిచ్చారు. నవరత్నాల ద్వారా పేదల అభ్యున్నతికి పెద్దపీట వేస్తున్నారని అన్నారు. అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారని చెప్పారు. విశాఖలో రాజధానిని తెలుగుదేశం పార్టీ నేతలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రానికి మూడు రాజధానుల విషయంలో టీడీపీ తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అమరావతి పేరుతో అమరావతిలో టీడీపీ నేతలు భూములను కొల్లగొట్టారని చెప్పారు. ఆస్తులను నష్టపోతామనే ఉద్దేశంతోనే ఆ ప్రాంత రైతులను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన పైవ్యాఖ్యలు చేశారు.

Thammineni Seetharam
Jagan
YSRCP
  • Loading...

More Telugu News