Andhra Pradesh: ఏపీలో పంచాయతీ రాజ్ ఎన్నికల కోసం రిజర్వేషన్లు ఖరారు

  • ముగిసిన ఏపీ మంత్రిమండలి సమావేశం  
  • త్వరలో పంచాయతీరాజ్ ఎన్నికలు
  • రిజర్వేషన్ల వివరాలు వెల్లడించిన మంత్రి పేర్ని నాని

ఏపీ మంత్రిమండలి సమావేశం ముగిసిన అనంతరం మంత్రి పేర్ని నాని మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మంత్రిమండలి నిర్ణయాలను వెల్లడించారు. త్వరలో జరగనున్న పంచాయతీరాజ్ ఎన్నికల కోసం రిజర్వేషన్లు ఖరారు చేసినట్టు తెలిపారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా, ఎస్టీ రిజర్వేషన్ ను 6.77 శాతం, ఎస్సీ రిజర్వేషన్ ను 19.08 శాతం, బీసీ రిజర్వేషన్ ను 34 శాతం గానూ నిర్ణయించినట్టు వివరించారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 ప్రకారం ఈ ఎన్నికలు నిర్వహించాలని ఏపీ మంత్రిమండలి తీర్మానించినట్టు పేర్ని నాని తెలిపారు.

Andhra Pradesh
Panchayat Raj
Eelections
Reservations
  • Loading...

More Telugu News