Allu Aravind: నేను అలా అన్నప్పుడల్లా నా ముగ్గురు కొడుకులు భయపడుతుంటారు: అల్లు అరవింద్
![](https://imgd.ap7am.com/thumbnail/tn-d899721469f0.jpg)
- బన్నీవాసు అంటే నాకు చాలా ఇష్టం
- నా నమ్మకాన్ని ఆయన నిలబెట్టాడు
- అతను కూడా నా కొడుకులాంటివాడేనన్న అరవింద్
గీతా ఆర్ట్స్ అధినేతగా .. నిర్మాతగా అల్లు అరవింద్ అనేక విజయాలను అందుకున్నారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ ను కూడా ఏర్పాటు చేసి, ఓ మాదిరి బడ్జెట్ సినిమాలను నిర్మిస్తున్నారు. ఈ బ్యానర్ కి సంబంధించిన వ్యవహారాలను ఆయన బన్నీ వాసుకి అప్పగించారు. తనపట్ల అల్లు అరవింద్ కి గల నమ్మకాన్ని బన్నీ వాసు నిలబెట్టుకుంటూ వస్తున్నాడు.
ఇటీవల ఆయన పర్యవేక్షణలో వచ్చిన 'ప్రతిరోజూ పండగే' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అల్లు అరవింద్ కి మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఈ సినిమా సక్సెస్ మీట్లో అల్లు అరవింద్ మాట్లాడుతూ, "బన్నీ వాసు అంటే నాకు చాలా ఇష్టం .. అతను నా కొడుకులాంటివాడే. ఇతనితో కలిసి నాకు నలుగురు కొడుకులు. బన్నీవాసు నా నాలుగో కొడుకు అన్నప్పుడల్లా, అతనికి కూడా ఆస్తులు రాసిస్తానేమోనని నా ముగ్గురు కొడుకులు భయపడుతుంటారు" అంటూ చమత్కరించారు.