Chiranjeevi: 'మెగా' అభిమానులకు జీవిత బీమా.. చిరంజీవి యువత ప్రకటన!

  • గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అఖిల భారత చిరంజీవి యువత
  • అభిమానుల కుటుంబాలకు అండగా ఇన్స్యూరెన్స్
  • వివరాలను మెయిల్ చేయాలని విన్నపం

ఇప్పటికే పలు సంక్షేమ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్న 'అఖిల భారత చిరంజీవి యువత' మరో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మెగా అభిమానులకు జీవిత బీమా చేయించాలని సంకల్పించింది. అభిమానులకు ఏదైనా ప్రమాదం సంభవించి., ఊహించని ఘటన జరిగితే... వారి కుటుంబాలకు అండగా ఉండేందుకు అభిమానుల పేరు మీద ఇన్స్యూరెన్స్ చేయించాలని నిర్ణయించింది. మన కుటుంబసభ్యులకు ఆసరాగా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా అఖిల భారత చిరంజీవి యువత సంస్థ ప్రకటించింది. మెగా అభిమానులందరూ వారి వివరాలను megastarchiranjeevi01@gmail.com కు మెయిల్ చేయాలని కోరింది.  

తెర తారలు కేవలం వినోదాన్ని పండించడానికే అనే భ్రమల్ని తొలగిస్తూ... అభిమానులను అక్కున చేర్చుకుని, వారి కుటుంబాల శ్రేయస్సుకు కూడా పాటుపడాలనేది చిరంజీవి అభిమతమని చిరంజీవి యువత తెలిపింది. ఆయన అభిమతానికి అనుగుణంగా ఈ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్టు ప్రకటించింది.

Chiranjeevi
Akhila Bharatha Chiranjeevi Yuvatha
Insurence
Tollywood
  • Error fetching data: Network response was not ok

More Telugu News