Naga Shaurya: సమంత చేతుల మీదుగా 'అశ్వద్ధామ' టీజర్ రిలీజ్

  • 'అశ్వద్ధామ'గా నాగశౌర్య 
  • దర్శకుడిగా రమణతేజ పరిచయం 
  • వచ్చేనెల 31వ తేదీన విడుదల

నాగశౌర్య కథానాయకుడిగా 'అశ్వద్ధామ' రూపొందింది. దర్శకుడిగా రమణతేజ పరిచయమవుతున్న ఈ సినిమాలో కథానాయికగా మెహ్రీన్ కనిపించనుంది. తాజాగా సమంత చేతుల మీదుగా ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను రిలీజ్ చేయించారు. "ఎలా వుంటాడో కూడా తెలియని ఒక రాక్షసుడు .. వాడికి మాత్రమే తెలిసిన ఒక రహస్యం .. వాడి కింద పనిచేసే సైన్యం .. గమ్యం తెలియని ఒక యుద్ధం .. ఆ యుద్ధం గెలవాలంటే ఒక ఆరడుగుల నారాయణాస్త్రం కావాలి" అంటూ వాయిస్ ఓవర్ తో ఈ టీజర్ మొదలవుతోంది.

నాగశౌర్యకి సంబంధించిన యాక్షన్ సన్నివేశాలపై ఈ టీజర్ ను కట్ చేశారు. రఫ్ లుక్ తో నాగశౌర్య కనిపిస్తున్న ఈ సినిమాపై అంచనాలు బాగానే వున్నాయి. జనవరి 31వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. సొంత బ్యానర్ పై నాగశౌర్య చేస్తున్న ఈ సినిమా, ఆయనకి సక్సెస్ ను తెచ్చిపెడుతుందేమో చూడాలి.

  • Loading...

More Telugu News