CM Jagan: జగన్ కాన్వాయ్ వెళ్లేందుకు అడ్డంకుల్లేకుండా పోలీసుల 'డమ్మీ' ప్లాన్

  • తొలుత ఐదు వాహనాలతో మరో కాన్వాయ్ 
  • దాని వెనుక ముఖ్యమంత్రి కాన్వాయ్ 
  • రైతుల ఆందోళనల నేపథ్యంలో ముందు జాగ్రత్తలు

కేబినెట్ సమావేశానికి హాజరు కావాల్సి ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్ రన్నింగ్ కు ఎటువంటి ఆటంకాలు లేకుండా పోలీసులు మాస్టర్ ప్లాన్ వేశారు. రాజధాని రైతుల ఆందోళనల నేపథ్యంలో అమరావతిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రిని కూడా సచివాలయానికి వెళ్లకుండా అడ్డుకుంటామని రైతులు ప్రకటనలు చేశారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రైతుల నుంచి సమస్య లేకుండా డమ్మీ కాన్వాయ్ ని పంపేందుకు ఏర్పాట్లు చేశారు.

ఇందులో భాగంగా తొలుత ఐదు వాహనాల కాన్వాయ్ సచివాలయం వైపు దూసుకువచ్చింది. కాసేపటికి దాని వెనుక ముఖ్యమంత్రి కాన్వాయ్ సచివాలయానికి చేరుకుంది. ఎక్కడా ఎటువంటి ఆటంకం కలగకపోవడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.

CM Jagan
covoy
amaravathi
farmers agitation
  • Loading...

More Telugu News