Vijay Sai Reddy: పాలకులు మారితే రాజధాని మారుతుందా అని కన్నా గారు అమాయకంగా ప్రశ్నిస్తున్నారు: విజయసాయిరెడ్డి

  • కన్నాపై ట్విట్టర్ లో విజయసాయి వ్యాఖ్యలు
  • రాజధాని ఎక్కడుందో కనిపించిందా? అంటూ ట్వీట్
  • గ్రాఫిక్స్ చూసి భ్రమించారా? అంటూ వ్యంగ్యం

ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యలు చేశారు. పాలకులు మారితే రాజధాని మారుతుందా? అని కన్నా గారు అమాయకంగా ప్రశ్నిస్తున్నారని విమర్శించారు. అసలు, మీకు రాజధాని ఎక్కడుందో కనిపించిందా? లేక గ్రాఫిక్స్ చూసి మీరూ భ్రమపడ్డారా? అంటూ ప్రశ్నించారు. చంద్రబాబుకు మద్దతుగా మీరెంత వాదించినా ప్రయోజనంలేదని, పార్టీ అధ్యక్షుడిగా తనకు అనుకూలమైన వ్యక్తిని నియమించడానికి ఆయన చేస్తున్న పైరవీలను ఆపడని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.

Vijay Sai Reddy
Andhra Pradesh
Amaravathi
Kanna Lakshminarayana
YSRCP
BJP
  • Loading...

More Telugu News