Ouagadougou: పశ్చిమాఫ్రికాలో ఇస్లామిక్ ఉగ్రవాదుల దాడి.. 35 మంది పౌరుల మృతి
- మాలి సరిహద్దుకు సమీపంలోని ఆర్బిండాపై ఉగ్ర దాడి
- మృతుల్లో ఎక్కువ మంది మహిళలే
- 80 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం
పశ్చిమాఫ్రికాలోని బుర్కినాఫసో దేశంలో ఇస్లామిక్ ఉగ్రవాదులు మరోమారు దాడులకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఆ దేశ అధ్యక్షుడు రోక్ మార్క్ క్రిస్టియన్ కబోర్ ప్రకటించారు. మాలి సరిహద్దుకు సమీపంలోని ఆర్బిండా అనే పట్టణంపై ఉగ్రవాదులు నిన్న ఉదయం దాడికి పాల్పడినట్టు తెలిపారు. ఉగ్ర దాడుల్లో కనీసం 35 మంది పౌరులు మృతి చెందారని, మృతుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నారని పేర్కొన్నారు. ఈ దాడి ఘటన నేపథ్యంలో రంగంలోకి దిగిన సైన్యం 80 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు వెల్లడించారు. సైన్యం, ఉగ్రవాదులకు మధ్య జరిగిన పోరులో ఏడుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయినట్టు చెప్పారు.