dalai lama: తదుపరి దలైలామా ఎవరు? అన్న ప్రశ్నపై దలైలామా స్పందన

  • ఈ విషయంపై అంత తొందర ఎందుకు?
  • నాకు  85 ఏళ్లు
  • నేను ఆరోగ్యంగానే ఉన్నాను

కమ్యూనిస్టు చైనా వద్ద తుపాకులు, ఆయుధాలు ఉంటే తమ వద్ద సత్యం ఉందని టిబెట్ బౌద్ధ మత గురువు దలైలామా అన్నారు. ఆయుధ శక్తి మీద సత్యమే గెలుస్తుందని వ్యాఖ్యానించారు. క్రిస్మస్ సందర్భంగా ఆయన బీహార్‌లోని బుద్ధగయలో మీడియాతో మాట్లాడుతూ.. బౌద్ధులు ఎక్కువగా ఉన్న దేశాల్లో చైనా ఒకటని, అక్కడి బౌద్ధులు ఇప్పుడిప్పుడే  తాము నమ్మే బౌద్ధమే నిజమైనదనే అభిప్రాయానికి వస్తున్నారని చెప్పారు.

తదుపరి దలైలామా ఎవరనే విషయంపై ఆయన స్పందిస్తూ.. ఈ విషయంపై అంత తొందర ఎందుకు? అని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు తనకు 85 ఏళ్లని, తాను ఆరోగ్యంగానే ఉన్నానని అన్నారు. కాగా, వచ్చేనెల  6న జరిగే ఓ కార్యక్రమంలో దాదాపు 50,000 మంది బౌద్ధులనుద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.

dalai lama
China
India
  • Loading...

More Telugu News