vice president: ఇంగ్లీష్ అవసరమే... కానీ బోధన మాతృభాషలోనే జరగాలి: వెంకయ్యనాయుడు

  • స్వర్ణభారతి ట్రస్ట్ ఇష్టాగోష్ఠిలో వ్యాఖ్య 
  • నేను ఆంగ్లానికి వ్యతిరేకం కాదు 
  • భాష వల్లే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భాషా ప్రయుక్త రాష్ట్రమని, తెలుగు భాషవల్లే రాష్ట్రం ఏర్పడిందని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఈ రోజు రాజధానిలో స్వర్ణభారతి ట్రస్ట్ నిర్వహించిన ఇష్టాగోష్ఠిలో ఆయన మాట్లాడారు. అంతటి ప్రాధాన్యం ఉన్నందునే విద్యా బోధన తెలుగులో జరగాలన్నది తన అభిమతమని చెప్పారు. అంతమాత్రాన తాను ఇంగ్లీష్ కు వ్యతిరేకం కాదని, ఆంగ్లం కూడా అవసరమేనని, కానీ ప్రాథమిక విద్యాబోధన మాతృభాషలోనే జరిగితే భావితరాలకు మేలు జరుగుతుందని చెప్పారు.

మాతృభాషలో బోధన ఎంత అవసరమో ప్రధాని కూడా చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. కృష్ణా జిల్లా నాగాయలంకకు మిసైల్ కేంద్రం వస్తుందని, కర్నూలు జిల్లా ఓర్వకల్లులో డిఫెన్స్ యూనివర్సిటీ, నెల్లూరులో అల్యూమినియం కర్మాగారం ఏర్పాటు కాబోతున్నాయని తెలిపారు.

vice president
Venkaiah Naidu
english
telugu
  • Loading...

More Telugu News