Tirumala: నిన్న రికార్డు స్థాయిలో రూ. 4 కోట్లు దాటిన తిరుమల హుండీ ఆదాయం!

  • కొనసాగుతున్న భక్తుల రద్దీ
  • 31 కంపార్టుమెంట్లలో భక్తులు
  • దర్శనానికి 16 గంటల సమయం

నిన్న మంగళవారం నాడు తిరుమల శ్రీ వెంకటేశ్వరుని హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో రూ. 4.14 కోట్లుగా నమోదైంది. సప్తగిరులపై భక్తుల రద్దీ కొనసాగుతుండగా, ఇదే రద్దీ సంక్రాంతి వరకూ ఉంటుందని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఉదయం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివుండగా, వారికి స్వామి సర్వదర్శనానికి 16 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక టైమ్ స్లాట్ దర్శన౦, దివ్య దర్శనం, రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం వరకూ పడుతోందని అధికారులు వెల్లడించారు. మంగళవారం నాడు స్వామిని 76,705 మంది భక్తులు దర్శించుకున్నారు.

Tirumala
Hundi
Tirupati
Piligrims
  • Loading...

More Telugu News