First Smart Phone released in China: రియల్ మి నుంచి తొలి 5జీ స్మార్ట్ ఫోన్ ‘ఎక్స్ 50’

  • జనవరి 7న విడుదల చేయడానికి రంగం సిద్ధం
  • క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 765జీ చిప్‌సెట్‌తో రానున్న ఫోన్
  • 30 నిమిషాల్లోనే ఫోన్ 70 శాతం చార్జింగ్  

స్మార్ట్ ఫోన్లు 5జీ ఫోన్లలో తయారీ సంస్థల మధ్య పోటీ ఊపందుకుంటోంది. చైనాలోని ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్ మి తన తొలి 5జీ స్మార్ట్ ఫోన్ ‘ఎక్స్50’ విడుదల చేయనుంది. ఇందుకు వచ్చే ఏడాది 7న ముహూర్తం నిర్ణయించామని సంస్థ వెల్లడించింది. ఈ ఫోన్‌కు సంబంధించిన ముఖ్యమైన స్పెసిఫికేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి.

సరికొత్త క్వాల్‌కామ్ స్నాప్‌ డ్రాగన్ 765జీ చిప్‌సెట్‌ను ఇందులో ఉపయోగించారు. 5జీ, వై-ఫై కనెక్షన్లకు ఈ ఫోన్ ఒకేసారి సపోర్ట్ చేస్తుంది. వూక్ 4.0 ఫాస్ట్ చార్జింగ్ వల్ల 30 నిమిషాల్లోనే ఫోన్ 70 శాతం చార్జింగ్ అవుతుంది. ఊహాగానాలను బట్టి ‘ఎక్స్50’లో 6.44 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే, 60 ఎంపీ+8ఎంపీ+2 ఎంపీ+2ఎంపీ క్వాడ్ రియర్ కెమెరా, 32 ఎంపీ+8ఎంపీ డ్యూయల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలు ఉన్నాయని సమాచారం.

  • Loading...

More Telugu News