CDS post creation: సీడీఎస్ పదవికి కేంద్ర కేబినెట్ కమిటీ ఆమోదం

  • గత స్వాతంత్ర్య దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రకటన మేరకే సీడీఎస్ ఏర్పాటు
  • అజిత్ దోవల్ కమిటీ నివేదికకు కూడా ఓకే  
  • సైనిక సంస్కరణల్లో భాగంగానే సీడీఎస్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన

భారత సైన్యం, నావికాదళం, వాయుసేనలతో కలిపి త్రివిద దళాలను సమన్వయం చేసేందుకు ఉద్దేశించిన ‘చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్’(సీడీఎస్) పదవి ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ కమిటీ (సీసీఎస్) ఆమోదం తెలిపింది. సీడీఎస్ అధికారి బాధ్యతలు, పదవి ఫ్రేమ్ వర్క్ పై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ ఇచ్చిన నివేదికను కూడా కేబినెట్ కమిటీ ఆమోదించింది.

అయితే, ఈ పదవిలో నియామకం కానున్న వ్యక్తి పేరును ఇంకా ప్రకటించలేదు. దేశ రక్షణను మరింత పటిష్టం చేయడానికి చేపట్టిన సైనిక సంస్కరణల్లో భాగంగా త్రివిద దళాలకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ను ఏర్పాటు చేయనున్నట్లు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అనంతరం. సీడీఎస్ నియామకం, బాధ్యతలపై దోవల్ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశారు.

CDS post creation
union cabinet commitee approeved
Defnce
Army
Navy
  • Loading...

More Telugu News