YSRCP: భూములిచ్చిన రైతులకు న్యాయం జరగాలి:ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు

  • అమరావతి రైతులు రాజధాని కావాలని అడగలేదు
  • భూములు కావాలని కోరగానే రైతులు స్వచ్ఛందంగా ఇచ్చేశారు
  • రాజధాని రైతులకు ముఖ్యమంత్రి న్యాయం చేస్తారనే నమ్మకం ఉంది

రాజధానికోసం స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులకు న్యాయం జరగాలని వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. నరసరావుపేటలో ఆయన మీడియాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళనపై మాట్లాడారు. రైతుల ఆందోళనలో న్యాయం ఉందన్నారు. రాజధాని ఎక్కడ నిర్మిస్తున్నారనే అంశంకంటే.. భూములిచ్చిన రైతులకు న్యాయం జరగాలని పేర్కొన్నారు. అమరావతి రైతులు రాజధాని కావాలని అడగలేదని ఎంపీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం రాజధానికోసం భూములు కావాలని కోరగానే రైతులు తమ భూములను స్వచ్ఛందంగా ఇచ్చేశారన్నారు. రాజధాని రైతులకు ముఖ్యమంత్రి న్యాయం చేస్తారనే నమ్మకం తనకు ఉందని ఎంపీ లావు చెప్పారు.

YSRCP
MP Lavu Sri Krishna Devarayalu
comments
on Farmers Agitation
  • Loading...

More Telugu News