West Bengal: జాద‌వ్‌పూర్ వ‌ర్సిటీలో పశ్చిమ బెంగాల్ గవర్నర్ కు మరోసారి చేదు అనుభవం

  • స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు వర్సిటీకి గ‌వ‌ర్న‌ర్‌ 
  • కారుకు అడ్డుగా నిలిచిన విద్యార్థులు 
  • న‌ల్ల‌ జెండాల‌తో నిరసన 
  • సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌క‌తాలోని జాద‌వ్‌పూర్ విశ్వవిద్యాలయంలో ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ జ‌గ‌దీప్ ధంక‌ర్‌కు చేదు అనుభవం ఎదురైంది. స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు వర్సిటీకి గ‌వ‌ర్న‌ర్‌ వచ్చారు. అయితే, ఆయన కారుకు అడ్డుగా నిలిచిన విద్యార్థులు న‌ల్ల‌ జెండాల‌తో నిరసన తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్య‌తిరేకంగా విద్యార్థులు ధ‌ర్నాకు దిగారు. గతంలో సీఏఏకు అనుకూలంగా గ‌వ‌ర్న‌ర్ మాట్లాడిన నేపథ్యంలో ఈ రోజు ఆయనను విద్యార్థులు అడ్డుకున్నారు. దీంతో గ‌వ‌ర్న‌ర్ జ‌గ‌దీప్ అసంతృప్తి వ్య‌క్తం చేస్తూ... ఆందోళ‌న‌ల‌ను వ‌ర్సిటీ అదుపు చేయ‌లేక‌పోవ‌డం దారుణ‌మ‌ని అన్నారు.

కొద్దిమంది విద్యార్థులు మాత్రమే కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారని గవర్నర్ అన్నారు. కనుచూపు మేర చట్ట నిబంధనలు కనిపించడం లేదని, రాజ్యాంగ అధిపతిగా ఇది తనను ఆందోళనకు గురిచేస్తోందని ఆయన ట్వీట్‌ చేశారు. యూనివర్సిటీ ఉన్నతాధికారులతో సమావేశం సందర్భంగా నిన్న క్యాంపస్‌కు చేరుకున్న సందర్భంలోనూ ఆయనను విద్యార్థులు అడ్డుకున్నారు.

  • Loading...

More Telugu News