Indigo: ఇండిగో భారీ డిస్కౌంట్లు... రూ. 899కే విమానం టికెట్!

  • 'ది బిగ్ ఫ్యాట్ ఇండిగో సేల్' మొదలు
  • 26 వరకూ అందుబాటులో
  • విదేశీ ప్రయాణానికి రూ. 2,999కి టికెట్

అందుబాటు ధరల్లో విమాన టికెట్లను అమ్ముతూ చౌక ధరల విమానయాన సంస్థగా గుర్తింపు పొందిన ఇండిగో, 'ది బిగ్ ఫ్యాట్ ఇండిగో సేల్' పేరిట దేశీయ రూట్లలో రూ. 899కే టికెట్లను అందించాలని నిర్ణయించింది. 26వ తేదీ రాత్రి 11.59 నిమిషాల వరకూ టికెట్ సేల్ అందుబాటులో ఉంటుందని, వచ్చే సంవత్సరం జనవరి 15 నుంచి ఏప్రిల్ 15 వరకూ ప్రయాణ తేదీని నిర్ణయించుకోవచ్చని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. విదేశీ ప్రయాణ ప్రారంభ టికెట్ ధరను రూ. 2,999కే అందిస్తున్నామని, ఇండిగో వెబ్ సైట్, యాప్ ల ద్వారా కూడా బుకింగ్ చేసుకోవచ్చని పేర్కొంది.

Indigo
Low Cost
Airlines
Cheap
Tickets
  • Loading...

More Telugu News