Pawan Kalyan: ఉస్మానియా యూనివర్శిటీకి వెళ్లనున్న పవన్ కల్యాణ్!

  • జనవరి 5న ఓయూలో విద్యార్థి గర్జన
  • ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వ వైఫల్యం
  • విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శ

జనవరి 5న ఉస్మానియా యూనివర్శిటీలో జరుగనున్న జనసేన విద్యార్థి గర్జనకు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయాన్ని పార్టీ తెలంగాణ విద్యార్థి సంఘం నాయకులు, వర్శిటీ జేఏసీ నాయకులు తెలిపారు. యూనివర్శిటీలోని అతిథి గృహంలో మీడియా సమావేశం నిర్వహించిన విద్యార్థి నేతలు, విద్యా వ్యవస్థను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, ఉద్యోగాలను భర్తీ చేయడంలోనూ వైఫల్యాన్ని ప్రదర్శిస్తోందని ఆరోపించారు. సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడమే లక్ష్యంగా ఈ విద్యార్థి గర్జన తలపెట్టినట్టు తెలిపారు. 

Pawan Kalyan
Osmania University
Vidhyarthi Gharjana
  • Loading...

More Telugu News