Anathapuram district: అలా అయితే, న్యాయవాదులు మూడు పెళ్లిళ్లు చేసుకోవాలి: టీడీపీ నేత పార్థసారథి సెటైర్లు

  • కర్నూలులో హైకోర్టు.. రెండు చోట్ల బెంచ్ లు
  • న్యాయవాదులందరూ మూడు చోట్ల ఇళ్లు కట్టుకోవాలి
  • మూడు కుటుంబాలను పోషించాల్సి ఉంటుంది

ఏపీకి మూడు రాజధానుల అంశంపై అనంతపురం టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పార్థసారథి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కర్నూలులో హైకోర్టు, వేరే చోట్ల రెండు హైకోర్టు బెంచ్ లు ఏర్పాటు చేస్తే న్యాయవాదులందరూ మూడు చోట్ల ఇళ్లు కట్టుకోవాలని, మూడు పెళ్లిళ్లు చేసుకోవాలని, మూడు కుటుంబాలను పోషించాల్సి ఉంటుంది అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అలాగే, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా ఒక కాలు విజయవాడలో వేస్తే, మరో కాలు విశాఖపట్టణంలో వేసే పరిస్థితి ఉంటుందని అన్నారు.

Anathapuram district
Telugudesam
parthasarathy
  • Loading...

More Telugu News