Jaggareddy Congress: మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ గెలుపు ఖాయం: జగ్గారెడ్డి

  • ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధంగా ఉంది
  • సింగూరు నీటి తరలింపుతో రెండు జిల్లాల ప్రజల కష్టాలకు గురవుతున్నారు
  • నీటి సమస్యపై మంత్రి హరీశ్ రావు సమాధానం చెప్పాలి

మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వెలువడుతోందని వస్తోన్న వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందిస్తూ.. ఎన్నికలు ఎప్పుడు జరిపినా కాంగ్రెస్ సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడారు. సింగూర్ నీటి తరలింపుతో సంగారెడ్డి జిల్లాతో పాటు మెదక్ జిల్లా ప్రజలు నీటికోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. నీటి సమస్యపై మంత్రి హరీశ్ రావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలపై అలక్ష్యం తగదని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తమ పార్టీ అన్ని స్థానాలు కైవసం చేసుకోవడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు.

Jaggareddy Congress
water Problem in sangareddy and medak
congress ready to face municipal Elections
  • Loading...

More Telugu News