Jarkhand: మెజారిటీ దిశగా కాంగ్రెస్, జేఎంఎం కూటమి.. బీజేపీ నుంచి చేజారిపోయిన ఝార్ఖండ్!

  • 2014లో 37 స్థానాలు గెలుచుకున్న బీజేపీ
  • తాజా ఎన్నికల్లో ఇప్పటికే కాంగ్రెస్ కూటమికి 41 స్థానాల్లో ఆధిక్యం
  • ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా కూటమి 

ఝార్ఖండ్ కు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, జేఎంఎం నేతృత్వంలోని కూటమి స్పష్టమైన మెజారిటీని సాధించే దిశగా దూసుకెళుతోంది. మొత్తం 81 స్థానాలున్న రాష్ట్రంలో బీజేపీ 30 చోట్ల మాత్రమే ఆధిక్యంలో ఉంది. 2014లో బీజేపీ 37 స్థానాలను గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి ఇప్పటికే 41 స్థానాల్లో (జేఎంఎం 23, కాంగ్రెస్ 14, ఆర్జేడీ 4) ఆధిక్యంలో దూసుకెళుతోంది. దీంతో ఝార్ఖండ్ రాష్ట్రం దాదాపుగా బీజేపీ చేజారినట్టేనని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. తుది ఫలితాలు మరో రెండు గంటల వ్యవధిలో వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి.

  • Loading...

More Telugu News