kadiri: ఎల్లుండి కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం మూసివేత
![](https://imgd.ap7am.com/thumbnail/tn-2d491f032d01.jpg)
- ఈ నెల 26న సూర్య గ్రహణం
- బుధవారం సాయంత్రం మూతపడనున్న ఆలయం
- గురువారం మధ్యాహ్నం తెరుచుకోనున్న ఆలయ తలుపులు
26న సూర్య గ్రహణాన్ని పురస్కరించుకుని ఈ నెల 25న కదిరిలోని శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని మూసివేయనున్నట్టు ఆలయ చైర్మన్ రెడ్డెప్ప శెట్టి, ఈఓ వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. గ్రహణం ముగిసిన అనంతరం గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఆలయాన్ని తిరిగి తెరవనున్నట్టు పేర్కొన్నారు.
బుధవారం సాయంత్రం 7.30 గంటల లోపు స్వామి వారికి నిత్య కైంకర్యాలు పూర్తిచేయనున్నట్టు వివరించారు. గురువారం మధ్యాహ్నం ఆలయం తెరిచిన తర్వాత శుద్ధి, సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని, స్వామివారికి, పరివార దేవతలకు నిత్య కైంకర్యాలు పూర్తి చేసిన తర్వాత సాయంత్రం 4.30 గంటల నుంచి ఆలయంలోకి భక్తులను అనుమతించనున్నట్టు తెలిపారు.