visakhapatnam: ఈ నెల 27న కేబినెట్ సమావేశం: మంత్రి బొత్స

  • జీఎన్ రావు నిపుణుల కమిటీ నివేదికపై చర్చిస్తాం
  • ముంబై తర్వాత అంతగా అభివృద్ధి చెందే నగరం విశాఖ
  • ఈ నెల 28న విశాఖలో అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన

ఈ నెల 27న ఏపీ కేబినెట్ సమావేశం జరగనున్నట్టు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విశాఖపట్టణంలో ఈరోజు ఆయన మాట్లాడుతూ, జీఎన్ రావు నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ముంబై తర్వాత అంతగా అభివృద్ధి చెందే నగరం విశాఖ అని జీఎన్ రావు నిపుణుల కమిటీ గుర్తించిందని అన్నారు. త్వరలోనే మెట్రో రైల్ కు శంకుస్థాపన చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో పెట్టబుడులు పెట్టేందుకు ఎన్నో సంస్థలు ముందుకొస్తున్నాయని తెలిపారు. ఈ నెల 28న విశాఖలో పలు అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారని అన్నారు.

visakhapatnam
Minister
Botsa Satyanarayana
cm
Jagan
  • Loading...

More Telugu News