modi: ప్రజల తీర్పును గౌరవించాలి: పౌరసత్వ సవరణ చట్టంపై మోదీ స్పందన

  • రామ్ లీలా మైదానంలో మోదీ ప్రసంగం
  • సీఏఏ బిల్లు పార్లమెంటు ఉభయసభల్లో ఆమోదం పొందింది
  • ప్రజలు ఎన్నుకున్న పార్లమెంటు సభ్యుల నిర్ణయాన్ని అందరూ గౌరవించాలి

రామ్ లీలా మైదానం అనేక వేదికలకు సాక్షిగా నిలిచిందని ప్రధాని మోదీ అన్నారు.  ఆ మైదానంలో ఈ రోజు నిర్వహించిన ఓ సభలో ఆయన మాట్లాడుతూ... 'సభకు భారీగా తరలివచ్చిన  బీజేపీ శ్రేణులకు ధన్యావాదాలు. మనకు స్వాతంత్ర్యం వచ్చి కొన్ని దశాబ్దాలు అవుతోంది. ఢిల్లీలోని చాలా మంది ఇప్పటికి భయం, అనిశ్చితి, మోసం, ఎన్నికల్లో ఇచ్చే అసత్య హామీలపై అసంతృప్తితో ఉన్నారు' అని వ్యాఖ్యానించారు.

'ఇక్కడి మెట్రో నాలుగో దశ ప్రాజెక్టును ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం రాజకీయం చేసింది. ఈ ప్రాజెక్టు ఏనాడో ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, చాలా ఆలస్యమైంది. ప్రజల పేరిట రాజకీయాలు చేస్తున్నవారు ఎప్పటికీ ప్రజల బాధలను అర్థం చేసుకోరు పార్లమెంటులో ఇటీవల సీఏఏ బిల్లు పార్లమెంటు ఉభయసభల్లో ఆమోదం పొందింది. ప్రజలు ఎన్నుకున్న పార్లమెంటు సభ్యుల నిర్ణయాన్ని అందరూ గౌరవించాలి. ప్రజల తీర్పుని గౌరవించాలి' అని వ్యాఖ్యానించారు.


modi
caa
India
  • Loading...

More Telugu News