GN Rao Committee: జీఎన్ రావు కమిటీ నివేదికపై ఈ నెల 27న నిర్ణయం: బొత్స

  • క్యాబినెట్ లో చర్చిస్తామని వెల్లడి
  • కమిటీ రిపోర్టులు పట్టించుకోలేదని గత ప్రభుత్వంపై ఆరోపణలు
  • రాజధాని రైతుల పట్ల సానుకూల ధోరణి వ్యక్తం చేసిన బొత్స

రాజధానిపైనా, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపైనా అధ్యయనం చేసిన జీఎన్ రావు కమిటీ నివేదికపై వైసీపీ ప్రభుత్వం ఈ నెల 27న నిర్ణయం తీసుకుంటుందని ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. కమిటీ నివేదికపై క్యాబినెట్ లో చర్చించిన తర్వాతే నిర్ణయం వెలువడుతుందని స్పష్టం చేశారు.

గత ప్రభుత్వం శివరామకృష్ణ, శ్రీకృష్ణ కమిటీల నివేదికలను పక్కనపెట్టిందని ఆరోపించారు. ఈ సందర్భంగా బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం రాజధాని రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు తమ ప్రభుత్వం సానుకూలంగా ఉందని వివరించారు. అమరావతి రైతుల భూముల విషయంలో మంత్రి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు వక్రభాష్యం చెప్పారని, ఆయన అసైన్డ్, ఇతర భూముల విషయం మాత్రమే మాట్లాడారని బొత్స స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News