CAA-NRC: ప్రభుత్వ విధానాలపై స్పందించే హక్కు ప్రజలకుంది: సోనియా గాంధీ

  • సీఏఏ, ప్రతిపాదిత ఎన్నార్సీలపై ప్రజల ఆందోళన సరైనదే
  • ప్రజల అభిప్రాయాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది
  • ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయాన్ని అణచివేయడం తగదు

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), ప్రతిపాదిత జాతీయ పౌర జాబితా(ఎన్నార్సీ) విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మండిపడ్డారు. వీటిపై ప్రజల్లో వెల్లువెత్తుతోన్న నిరసనను సోనియా సమర్థిస్తూ..ఆందోళనచేపట్టిన విద్యార్థులు, ప్రజలకు సంఘీభావం తెలుపుతున్నట్లుగా ప్రకటించారు.

సోనియా గాంధీ ప్రసంగించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ మీడియాకు విడుదల చేసింది. నిరసన తెలుపుతున్న ప్రజలపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని తాము ఖండిస్తున్నట్లు సోనియా తెలిపారు. ప్రభుత్వ విధానాలపై అభిప్రాయాలు, నిరసనలు తెలిపే హక్కు ప్రజలకు ఉంటుందన్నారు. అదేవిధంగా ప్రజల అభిప్రాయాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందంటూ.. బీజేపీ మాత్రం ప్రజల అభిప్రాయాలను గౌరవించడంలేదని విమర్శించారు. ప్రజాభిప్రాయాన్ని అణచివేయడాన్నే బీజేపీ ఎంచుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఇది అంగీకరించరని పేర్కొన్నారు.

యూపీ ఆందోళనల్లో ఆరుగురి మృతి

ఇదిలా ఉండగా పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను వ్యతిరేకిస్తూ ఉత్తరప్రదేశ్ లో పలుచోట్ల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఈ రోజు జరిగిన ఆందోళనల్లో ఆరుగురు చనిపోయినట్లు యూపీ అధికారులు మీడియాకు తెలిపారు.

CAA-NRC
people agitation
Congress
Sonia Gandhi
comments
Through video
  • Loading...

More Telugu News